వేముల మండలంలో హోరెత్తిన వైఎస్సార్సీపీ జడ్పీటీసీ ప్రచారం!
నవపక్షం, వేముల ప్రతినిధి : వేముల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగెళ్ల సత్యప్రభావతమ్మ చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం అపూర్వ ప్రజాదరణతో ఉత్సాహభరితంగా సాగింది. బుధవారం ఉదయం నుంచే చాగలేరు, గుండ్లపల్లి, దుగ్గన్నగారిపల్లె, అమ్మాయగారిపల్లె మరియు గొల్లలగూడూరు గ్రామాల్లో ఆమె విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక నాయకులు పవన్ విశ్వేశ్వర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి సత్యప్రభావతమ్మ ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు మరియు యువత ఆమెకు హారతులు...