మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, బహుజన సంఘాల మద్దతు కోరిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకురాలు, సామాజిక సేవకురాలు, ముక్తేశ్వర చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గీతాంజలి ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన అభ్యర్థిత్వానికి మద్దతు, సహకారం అందించాలని కోరారు. అలాగే మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజన సంఘాలతో పాటు వివిధ సామాజిక సంస్థలు, సంఘాల...