నర్సంపేటలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి :  డెమోక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ అయిలినేని శ్రీనివాసరావు సూచన మేరకు, వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నర్సంపేటలోని ఢఫోడిల్స్ హైస్కూల్ ఆడిటోరియంలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థకు చెందిన న్యాయ ప్రతినిధులు అడ్వకేట్ డి. సాంబయ్య, అడ్వకేట్ టి. సునీత, ప్యానల్ అడ్వకేట్ ఎన్. రమేష్, అడ్వకేట్ ఎ. సుధీర్ పాల్గొని బాలల హక్కులు, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక...