రాష్ట్రపతి అవార్డు గ్రహీత డా. సాజిద్ ఖాన్ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన, ఆడియో ఇంజినీరింగ్ రంగంలో విశేష సేవలు అందించిన డా. సాజిద్ ఖాన్ను హైదరాబాద్లో డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి తన అభ్యర్థిత్వానికి మద్దతు, సహకారం అందించాలని డా. సాజిద్ ఖాన్ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డా. సాజిద్ ఖాన్, యువతలో సామాజిక సేవ పట్ల ఆసక్తి...