పోలీస్ బాస్ సంచలనాత్మక అడుగుకు శ్రీకారం.. నేర చరిత్ర కలిగిన కేటుగాళ్లకు ఇక జిల్లాలో నో ఎంట్రీ
నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిది: జిల్లా బహిష్కరణ అస్త్రం ప్రయోగించే దిశగా ఎస్పీ నరసింహా కీలక ఆలోచన చేస్తున్నారు. పోకిరీలు, రౌడీషీటర్లు, నేరగాళ్లకు పోలీస్ పవర్ చూపించేందుకు ఎస్పీ మాస్టర్ ప్లాన్ పక్కా ప్రణాళికతో నేరాలకు స్వస్తి పలికేందుకు శ్రీకారం.. పీడీ యాక్ట్ ల ద్వారా నేరగాళ్లకు చట్టం అంటే ఏమిటో చూపించేలా కఠిన కార్యాచరణ అమలు చేసే దిశగా అడుగులు వేయనున్నారు. సూర్యాపేట జిల్లాలో ఏ మూలన నేరం జరిగినా నేరస్తులకు తప్పించుకునే మార్గాలు లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట నిఘా...