రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యను డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు తెలిపి, ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ సందర్భంగా పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, విద్యావంతుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమస్యలకు శాసనమండలి వేదికగా ప్రాధాన్యత...