సూర్యాపేటలో ఏసీబీ అధికారుల సోదాలు

నవపక్షం, సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని మెప్మా (MEPMA) విభాగంలో అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి నివాసాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలో జీవీఎంసీతో పాటు నిజామాబాద్ నగరంలో కమిషనర్‌గా పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం హైదరాబాద్‌లో మెప్మా అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట పట్టణంలోని సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ఆయన స్వగృహంతో పాటు గాంధీనగర్‌లోని బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ...