ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ని ప్రగతి ఫౌండేషన్ చైర్మన్ మరియు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి (OU) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు తో వివిధ సామాజిక అంశాలు, యువత అభివృద్ధి, క్రీడల ప్రాధాన్యత, నిరుద్యోగ యువతకు అవకాశాలు మరియు సమాజ సేవకు సంబంధించిన అంశాలపై చర్చించారు. యువత క్రీడలు, విద్య, సామాజిక సేవా రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు