ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ పరిధిలోని బుచ్చినాయక్ తండాకు చెందిన వైష్ణవి అనే విద్యార్థిని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఐఐఐటీడీఎంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమ్మయ్య, కమల దంపతుల కుమార్తె అయిన వైష్ణవి ఐఐఐటీడీఎంలో మూడో సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన యువతి అర్ధాంతరంగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైష్ణవి మృతితో బుచ్చినాయక్ తండాలో...