కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారిని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారితో రవీంద్ర కుమార్ గారు ఆత్మీయంగా మాట్లాడారు. ఈ భేటీలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు.