తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్
నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన చదువును సైతం పక్కనపెట్టి, ఇంజనీరింగ్ విద్యను మధ్యలోనే ఆపి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో అనేకసార్లు లాఠీచార్జీలను ఎదుర్కొని, రాస్తారోకోల్లో పాల్గొని, జైలు జీవితాన్ని సైతం గడిపారు. ఉద్యమాల కోసం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అప్పుల పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమను ఆదుకుంటారని ఆశించిన ఉద్యమకారులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన గుర్తింపు,...