వేముల మండలంలో జోరుగా వైకాపా ఎన్నికల ప్రచారం
నవపక్షం, వేముల ప్రతినిధి : వేముల మండల పరిధిలోని వేల్పుల, బేస్తావారిపల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి నాగేళ్ల సత్య ప్రభావతమ్మ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు. వైకాపా మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివరెడ్డి సతీమణి అయిన ఆమె గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని ఆశీస్సులు, మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాగేళ్ల విశ్వేశ్వర్ రెడ్డి, నాగేళ్ల...