మూడేళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూపులు.. బిక్షాటనతో నిరసన
నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: శక్రుతండా గ్రామపంచాయతీ పరిధిలోని బండమీది తండా, మొదలుకుంట తండాలకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ యువ నాయకుడు జటావత్ ప్రకాష్ నాయక్ (జె.పి.) ఆధ్వర్యంలో గ్రామస్థులు బిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. గత మూడేళ్లుగా రహదారి నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో రెండు తండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రకాష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, వృద్ధులు, గర్భిణులు ఆసుపత్రులకు చేరుకునేందుకు...