పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల, మర్రిగూడలో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు, నూతన పదాలను నేర్చుకోవడానికి, పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి డిక్షనరీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజూ డిక్షనరీని ఉపయోగిస్తూ ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని,...