తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!
నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. రణస్థలం మండలం చిల్లపేట రాజాం ఎంపీటీసీ ఎన్నికల్లో సమీప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 438 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయనకు ప్రజలు విశేష మద్దతు పలికారు. ఫలితాలు వెలువడగానే టీడీపీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకుని అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చిల్ల శ్రీనివాసరెడ్డి, గ్రామ అభివృద్ధికి,...