పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు: దేవరకొండ డిఎం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : దేవరకొండ RTC డిపో ఆధ్యర్యంలో కార్తీక మాసం పురస్కరించు కొని ఏపిలోని పంచారామ క్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు డిఎం విజయకుమారి తెలిపారు.ఈ నెల 15,22,29 డిసెంబర్ 6 తేదీలో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్ష్యరామం,సామర్లకోటలోని శైవ క్షేత్రలను ఒకే రోజు దర్శించుకోవచ్చు. పెద్దలకు రూ.2200,పిల్లలకు రూ.1200 టికెట్ ధర.వివరాలకు డిపో కార్యాలయంలో సంప్రదించ లన్నారు