ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

నవపక్షం, నాంపల్లి ప్రతినిధి : నాంపల్లి: మండలంలోని సుంకిశాల గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి రాధిక సందర్శించి పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను నమోదు చేసి, క్షేత్రస్థాయి ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ సందర్భంగా అధికారి రాధిక మాట్లాడుతూ.. ఇంకా ఎక్కడైనా వరి పంటలు ఎండిపోయి నష్టం వాటిల్లినట్లయితే రైతులు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించి పంట నష్ట వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే యాసంగి...