ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి సాయికుమార్ సందర్శించి పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలను ఫొటోల రూపంలో నమోదు చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి సాయి మాట్లాడుతూ, గ్రామంలో ఇతర రైతులకు కూడా వరి పంట ఎండిపోయినట్లయితే వెంటనే వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి పంట నష్టం వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎల్నినో ప్రభావం కారణంగా రానున్న...