ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో సర్పంచులకు భాగస్వామ్యం కల్పించాలి – మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని కలిసిన నాంపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :   ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో గ్రామపంచాయతీలు, గ్రామసభలకు ప్రాధాన్యత కల్పించకుండా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారని నాంపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిసి వివరించారు. ఈ సందర్భంగా నాంపల్లి గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో అర్హులైన పేదలను గుర్తించడంలో గ్రామపంచాయతీలు, గ్రామసభల...