జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఉస్మానియాలో క్విజ్ పోటీలు
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల క్విజ్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం, మేధో సామర్థ్యాన్ని వెలికితీయడం, సమకాలీన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో విశ్వవిద్యాలయానికి చెందిన 19 విభాగాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో లైబ్రరీ సైన్స్ విభాగం ప్రథమ బహుమతిని, జాగ్రఫీ విభాగం ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి....