నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి ;
శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి ఈరోజు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు వీహెచ్ హన్మంత్ రావుకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వీహెచ్ హన్మంత్ రావు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, నాటి పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు.
1948 ఆగస్టు 15న వల్లాల గ్రామంలోని పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేసిన 10 మంది విద్యార్థులను రజాకార్లు తుపాకులతో కాల్చి చంపారు. చిన్న వయసులోనే ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ విద్యార్థుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి కుటుంబాల సేవలు, త్యాగాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వీహెచ్ హన్మంత్ రావు పేర్కొన్నారు. నాటి ఘటనలు, అమరవీరుల చరిత్ర భావితరాలకు స్ఫూర్తిగా నిలిచేలా వారి త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు.


