నవపక్షం, దేవరకొండ ప్రతినిది:
దేవరకొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించారు. సీఐ వెంకట్ రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు, సేవలను కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడిచి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు నారాయణరెడ్డి, సలాకమ్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


