నవపక్షం, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ ఘాట్, రోడ్డు లో జరిగిన బస్సు ప్రమాదం సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని,మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గాయపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న.వారిని పరామర్శించారు. అనంతరం మంత్రి మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించారు.. క్షతగాత్రులకు లక్ష రూపాయల ఎక్స్ గ్రేసియా ప్రకటించారు. గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా, కలెక్టర్ దీపక్ తివారి వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి. వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్. మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి. మోమిన్ పేట పిఎసిఎస్ చైర్మన్ నరోత్తం రెడ్డి స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.

