నవపక్షం, భూపాలపల్లి ప్రతినిధి: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “శ్రీరామ హృదయం కలశం” శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
యువత మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని గౌరవించాలని, కుటుంబ విలువలను కాపాడుతూ సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ శోభాయాత్రలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నవపక్షం, భూపాలపల్లి ప్రతినిధి: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం, వికాస తరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ చిన్న జీయర్ స్వామి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన “శ్రీరామ హృదయం కలశం” శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. చందుపట్ల కీర్తి రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. యువత మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకుని వాటిని గౌరవించాలని, కుటుంబ విలువలను కాపాడుతూ సమాజం పట్ల బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ శోభాయాత్రలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Popular Categories


