నవపక్షం ,చెంగిచర్ల, ఆగస్టు 15:
గాంధీనగర్ కాలనీ అధ్యక్షుడు శంకర్ జన్మదిన వేడుకలను కాలనీ యువకులు, కాలనీ వాసుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువకులు, కాలనీ వాసులు శంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
కాలనీ అభివృద్ధి, సంక్షేమం కోసం శంకర్ చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు. కాలనీ వాసులందరినీ కలుపుకొని స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా శంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ యువకులు, పెద్దలు, మహిళలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.


