హెజెలో ఫార్మా ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

హెజెలో ఫార్మా ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోచంపల్లి మండలం దొతిగూడెంలోని హెజెలో ఫార్మా కంపెనీలో నిన్న రాత్రి రియాక్టర్ పేలుడు సంభవించి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.గతంలో కూడా ఈ కంపెనీలో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఘటనను ఎమ్మెల్యే గారు తీవ్రంగా పరిగణించారు. వెంటనే భువనగిరి జిల్లా కలెక్టర్ గారితో ఫోన్‌లో మాట్లాడి, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.అలాగే యశోద, సన్‌రైజ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండటంతో పాటు, కంపెనీ యాజమాన్యం నుంచి తగిన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే  కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కోరారు.వారివెంట పోచంపల్లి నాయకులు పాక మల్లేష్ యాదవ్, కళ్లెం రాఘవ రెడ్డి, సామా మోహన్ రెడ్డి, అంబరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.