నవపక్షం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి :
తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గట్టు నరేష్ గౌడ్ సూచనల మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అబ్బసాని సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం కోనరావుపేట మండల తెలంగాణ గౌడ యువజన సంఘం నూతన మండల కమిటీని ఏర్పాటు చేశారు.
నూతన కమిటీ మండల అధ్యక్షులుగా గొల్లపల్లి సాయి కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సింగం నరేందర్ గౌడ్ నియమితులయ్యారు.
ఉపాధ్యక్షులుగా ఏగలోపు ప్రవీణ్ గౌడ్, జగిరి కిరణ్ గౌడ్, కార్యదర్శులుగా తీగల భారత్ గౌడ్, గొల్లపల్లి ప్రమోద్ గౌడ్ నియమితులయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా తాళ్లపల్లి సందీప్ గౌడ్, నందగిరి గణేష్ గౌడ్లను నియమించారు.
ఈ సందర్భంగా జిల్లా గౌడ నాయకులు చంద్రశేఖర్ గౌడ్, తాళ్లపల్లి శ్రీకాంత్ గౌడ్, జవ్వాజి అరవింద్ గౌడ్, పిల్లి సతీష్ గౌడ్, భూమేష్ గౌడ్, నరేష్ గౌడ్, సురేందర్ గౌడ్ తదితరులు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
నూతనంగా ఏర్పడిన మండల కమిటీ గౌడ యువత సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు, గౌడుల ఐక్యతను బలోపేతం చేయాలని, గీత కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని, తెలంగాణ గౌడ యువజన సంఘం అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.


