రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: BC, SC, ST-JAC & DSP

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆగస్టు 31:

BC, SC, ST-JAC మరియు DSP సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రెసిడెంట్ ఎర్రోళ్ల శాంతికుమార్ నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా BC, SC, ST-JAC రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాసాల వినోద్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బకాయిలు విడుదల కాకపోవడంతో ముఖ్యంగా BC, SC, ST వర్గాలకు చెందిన పేద విద్యార్థులు కళాశాలల్లో తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని, కొందరు విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. ఈ సమస్య ప్రభావం విద్యార్థుల కుటుంబాలపై కూడా తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, విద్యార్థులు ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో BC, SC, ST-JAC మరియు DSP జిల్లా వైస్ ప్రెసిడెంట్ లింగస్వామి, జలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వి. శ్రీకాంత్, కార్యదర్శులు బి.ఆర్. సాయి కుమార్, ఏ. సురేష్, కె. సాయి కిరణ్, వెంకటేష్, చెక్క సాయి కుమార్, కె. గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Topics

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.