నవపక్షం, యాదాద్రి ప్రతినిధి :
భువనగిరి: ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా విజయ అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ & రిహాబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఎన్. రాఘవేంద్ర రావు PT మాట్లాడుతూ.. నొప్పి నివారణతో పాటు శారీరక సామర్థ్యాన్ని పెంచడంలో ఫిజియోథెరపీ కీలకమన్నారు. ఆర్థో, న్యూరో, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్, శస్త్రచికిత్స అనంతర రిహాబిలిటేషన్‌కు ఆధునిక ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.


