నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి :
ఆరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్, ప్రముఖ విద్యావేత్త, యాదవ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజు యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బెల్లి నాగరాజు యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంతో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యారంగ అభివృద్ధితో పాటు సమాజంలో విద్య, చైతన్యం, ఐక్యత పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రత్యేకమైనదని తెలిపారు. యాదవ విద్యావంతుల వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా విద్యావంతులను ఏకం చేస్తూ సమాజ పురోగతికి తనవంతు కృషి చేస్తున్నారని కొనియాడారు.
బెల్లి నాగరాజు యాదవ్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని, భవిష్యత్తులో విద్యారంగంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులు, సమాజ అభ్యున్నతికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు, యాదవ విద్యావంతుల వేదిక ప్రతినిధులు, అభిమానులు, సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు.


