నవపక్షం , దేవరకొండ, సెప్టెంబర్ 17:
దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ విగ్రహానికి గురువారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక విగ్రహ దాత కోట్ల వెంకటయ్య–పద్మ దంపతులు, వారి కుమారుడు మహేష్‌తో పాటు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం విఘ్నేశ్వర స్వామికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

