నవపక్షం, కొండభీమనపల్లి ప్రతినిధి :
గణపతి నవరాత్రుల సందర్భంగా కొండభీమనపల్లి గ్రామంలోని పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద భక్తులకు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి సందర్భంగా గణపతి విగ్రహ దాతలు గా అన్నదాన దాతలు గా మునుకుంట్ల విజయ్‌కుమార్, శోభ దంపతులు వ్యవహరించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.


