నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి :
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ పి.రాజశేఖర్ అన్నారు. మంగళవారం శాలిగౌరారం మండల కేంద్రంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ కమిటీ వారు ఏర్పాటు చేసిన గణనాధుని వద్ద ఎస్ ఐ బాబు తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వాహనాదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లికొండ గణేష్, ఆలయ కమిటీ సభ్యులు సైదులు, తాందారి సోమయ్య, గుండు పరమేష్, చిలుకూరు నవీన్, కుంభం సందీప్ తదితరులు పాల్గొన్నారు.


