నవపక్షం, గూడూర్ ప్రతినిధి:
ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాల్లో కోట మండలం కోటలోని శ్రీ ప్రగతి డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగానికి చెందిన విద్యార్థిని అమృత 9.8 గ్రేడ్ పాయింట్లు సాధించి విభాగంలో ప్రథమ స్థానంలో నిలవగా, ఆయేషా 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించింది.పరీక్షలకు హాజరైన 40 మంది విద్యార్థుల్లో ఏకంగా 10 మంది 9కి పైగా గ్రేడ్ పాయింట్లు సాధించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా వియ సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ విద్యార్థులను అభినందించారు. డిగ్రీ విద్యార్థులకు క్రమం తప్పకుండా తరగతులు నిర్వహించడంతో పాటు పరీక్షలు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు.విద్యార్థుల విజయానికి అంకితభావంతో కృషి చేసిన అధ్యాపకులను ఆయన అభినందించారు.విద్యార్థుల ప్రతిభకు ఈ ఫలితాలు నిదర్శనమని కళాశాల యాజమాన్యం పేర్కొంది.

