తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్న బబ్లు

నవపక్షం,గూడూరు ప్రతినిధి : 

తండ్రిపై తనకున్న ప్రేమను చాటుతూ తీపలపూడి బబ్లు తీసుకున్న నిర్ణయం కోట దళితవాడలో ప్రత్యేకంగా నిలిచింది.కోట మండలం కోటలోని దళితవాడలో ఏసీసీ అంబేద్కర్ క్రికెట్ క్లబ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.వేడుకల ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన గణనాథుడి గ్రామోత్సవంలో భక్తులు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారి లడ్డూను వేలం పాట నిర్వహించగా దళితవాడకు చెందిన తీపలపూడి బబ్లు తన తండ్రి కీర్తిశేషులు తీపలపూడి దయాకర్ జ్ఞాపకార్థం రూ.42 వేలతో లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.తండ్రి జ్ఞాపకార్థం లడ్డూను దక్కించుకున్న బబ్లు దానిని తన కుటుంబానికి మాత్రమే పరిమితం చేయకుండా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.వేలంలో దక్కిన స్వామివారి లడ్డూను తిరిగి గణనాథుడికే సమర్పించి,ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచాలని నిర్ణయించారు.తండ్రి జ్ఞాపకాన్ని గణనాథుడి సేవతో ముడిపెట్టి,భక్తులందరికీ ప్రసాదం అందించాలనే బబ్లు నిర్ణయం స్థానికంగా ప్రత్యేకంగా నిలిచింది.
తండ్రి కీర్తిశేషులు తీపలపూడి దయాకర్ జ్ఞాపకార్థం రూ.42 వేలతో లడ్డూను దక్కించుకోవడం ద్వారా తన తండ్రిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న బబ్లు, అనంతరం అదే లడ్డూను స్వామివారికి సమర్పించి భక్తులందరికీ పంచాలని నిర్ణయించడం ద్వారా తన సేవాభావాన్ని కూడా చాటుకున్నారు.తండ్రి జ్ఞాపకాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా భక్తి కార్యక్రమంతో ముడిపెట్టిన బబ్లు కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని స్థానికులు అభినందించారు.
ఈ సందర్భంగా తీపలపూడి బబ్లు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం లడ్డూను స్వామివారికి సమర్పించారు.కార్యక్రమంలో ఏసీసీ అంబేద్కర్ క్రికెట్ క్లబ్ యూత్ సభ్యులు,స్థానిక యువత,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కోట దళితవాడలో వినాయక చవితి వేడుకల ముగింపు కార్యక్రమం భక్తిశ్రద్ధలు,ఉత్సాహంతో ఘనంగా జరిగింది.

Hot this week

ACB వలలో నాంపల్లి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, ప్రైవేటు వ్యక్తి

నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 28: వ్యవసాయ భూమికి సంబంధించిన పంచనామా నివేదికను...

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 28: డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక...

అంతర్జాతీయ సమాచార సార్వత్రిక ప్రాప్యత దినోత్సవం

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : డిజిటల్ యుగంలో సమాచారం కేవలం ఒక వనరు...

పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి పబ్బు వజ్రమ్మకు కాంగ్రెస్ నాయకుల నివాళి

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త,...

గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు

  నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  స్వాతంత్ర్య సమరయోధుడు,విప్లవ కెరటం,షాహిద్ భగత్‌సింగ్ జయంతి...

Topics

గణనాథుడి గ్రామోత్సవంతో మార్మోగిన కోట దళితవాడ

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: కోట మండలంలోని కోట దళితవాడలో ఎసీసీ అంబేద్కర్ క్రికెట్...

శ్రీ ప్రగతి కాలేజి లో 40 మందిలో 10 మంది విద్యార్థులకు 9కి పైగా గ్రేడ్ పాయింట్లు

నవపక్షం, గూడూర్ ప్రతినిధి: ఇటీవల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విడుదల చేసిన డిగ్రీ...

చిట్టీల పేరుతో భారీ మోసం – రూ. 10 కోట్ల వసూల్ చేశారన్న ఆరోపణలు

నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి : చివ్వెంల మండలం లక్ష్మీ నాయక్ తండాకు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.