శ్యామసుందరపురం కాలనీ సీసీ రోడ్లకు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కృషి

నవపక్షం, కోట ప్రతినిధి : 

కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది.కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మంగళవారం కాలనీలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రహదారులు బురదమయంగా మారుతున్నాయని స్థానికులు వినోద్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యను గుర్తించిన ఆయన వెంటనే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల సమస్యపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి,పంచాయతీరాజ్ పీఆర్ఏఈ కిరణ్ ను శ్యామసుందరపురం కాలనీకి పంపించి సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన కొలతలు,మెజర్‌మెంట్లు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు కాలనీలో పర్యటించి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను పరిశీలించారు.ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సహాయ సహకారాలతో సుమారు రూ.15 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు త్వరలోనే శాంక్షన్ లభించే అవకాశం ఉందని,అనంతరం పనులు ప్రారంభమవుతాయని నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు.ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.కాలనీ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీసీ రోడ్ల సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.సమస్యను తన దృష్టికి తీసుకెళ్లిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి,వెంటనే స్పందించి అధికారులను పంపించిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్‌కు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం,జమ్మి ప్రసాద్,హనుమంత్ రెడ్డి,నందం మోహన్, పుల్లయ్య,అనిల్, బాలాజీ,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో...

దేవరకొండ వృద్ధాశ్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా సేవా కార్యక్రమం

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో...

రవి నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మహోత్సవాలు

నవపక్షం, కోట ప్రతినిధి : కోట మండలం కోట సెక్టార్ పరిధిలోని రవి...

పబ్బు రాజు గౌడ్ గారిని పరామర్శించిన భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 29: మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్...

పీఎం శ్రీ మోడల్ స్కూల్ మర్రిగూడలో ఘనంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల స్వాగత వేడుకలు

నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి : మర్రిగూడ: నల్గొండ జిల్లా మర్రిగూడలోని పీఎం శ్రీ...

Topics

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 29:     బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ...

రిషి ఇంజినీరింగ్ కాలేజీకి మంజూరైన స్వయం ప్రతిపత్తి హోదాపై సమగ్ర విచారణ జరపాలి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  రిషి ఇంజినీరింగ్ కాలేజీకి మంజూరైన స్వయం ప్రతిపత్తి...

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్ధినులు

నవపక్షం, కోట ప్రతినిధి : పొదలకూరు లో జరుగుతున్న 70వ జిల్లా స్థాయి...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.