నవపక్షం, కోట ప్రతినిధి :
పొదలకూరు లో జరుగుతున్న 70వ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) క్రీడా పోటీలలో సత్తా చాటిన శ్రీ ప్రగతి జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధినులు M. అశ్విత , M. పల్లవి. హ్యాండ్ బాల్ క్రీడలో అండర్ – 19 విభాగంలో పాల్గొని ప్రతిభ కనబరచి రాష్ట స్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ వీరిని అభినందించారు, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. తమ విద్యార్థులు చదువులలోనే కాకుండా క్రీడలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఆనందదాయకం అని తెలియజేశారు. అలాగే ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.


