నవపక్షం, చౌటుప్పల్ / అక్టోబర్ 02:
గ్రామపంచాయతీ కార్యాలయం ముందు విలేజ్ మ్యాప్ చిత్రపటాన్ని ముగ్గులతో వేసి చేయవలసిన పనులను వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి APO ఈశ్వరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని వికసిత్ భారత్ ప్లాన్ (VGPP) VBGRAM-G లో 325 పనులను గుర్తించుటకు గ్రామసభ నిర్వహించబడినది
1. నీటి సంరక్షణ
2. గ్రామీణ మౌలిక వసతుల కల్పన
3. జీవనోపాదుల కల్పన
4. విపత్తుల నిర్వహణ పనులు
5. గ్రామంలో పనులను గుర్తించడం
6. గ్రామానికి సంబంధించిన 2అంగన్వాడీ భవనాలు, గ్రంథాలయ భవన ము, మహిళా భవనానికి ప్రహరి నిర్మాణం, స్మశాన వాటిక ప్రహారీ నిర్మాణం , 3 మట్టి రోడ్ల నిర్మాణలు ,చెక్ డ్యాముల నిర్మాణలు, కుంటల పూడిక తీయుట, తదితర పనులను గుర్తించి నమోదు చేయించడం జరిగింది వికసిత్ భారత్ ప్లాన్ 60:40 శాతంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకమును అమలు చేయు పనుల యందు పారదర్శకత మరియు జవాబిదారితనం కలిగి ఉండుట సర్పంచ్ గారు మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు సంబంధించిన పనులను , ఇంకుడు గుంతల నిర్మాణాలు , స్కిల్ డెవలప్మెంట్ భవనాలు, మెటల్ రోడ్స్ , సిసి రోడ్ల నిర్మాణాలు గుర్తించి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను ప్రణాళికలో రూపొందించవలసిందిగా తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు వలందాస్ మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ గారు , బత్తుల అనుష మహేష్ గౌడ్ , ముద్దం లింగస్వామి గౌడ్ , దండగల వెంకటేశం , దొడ్ల సెట్టయ్య గౌడ్ , గంగాపురం పాండుగౌడ్ పంచాయతీ కార్యదర్శి , తాటిపాముల శ్రీశైలం గౌడ్ ( TA) ముద్ద మంజుల గారు , పెండెం లక్ష్మి మహిళ సంఘం అధ్యక్షులు , అంగన్వాడీ టీచర్స్ నల్ల జయప్రద , సప్పిడి కల్పన గార్లు , గ్రామపెద్దలు , ఉపాధి హామీ జాబు వర్కర్స్ , గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


