హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్, నగర్ పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటర్ గా నమోదు చేసుకోండి – న్యాయవాది పట్లొళ్ళ అమరేందర్ రెడ్డి

నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి :

హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రులైన, ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రముఖ న్యాయవాది పట్లొళ్ళ అమరేందర్ రెడ్డి ఒక గురువారం ప్రకటనలో తెలిపారు.28 సెప్టెంబర్ 2026నాడు పట్టభద్రుల నియోజకవర్గ నోటిఫికేషన్ వచ్చిందని, అందులో భాగంగా అన్ని మండల రెవెన్యూ కార్యాలయ వద్ద ప్రచురించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రతి పట్టభద్రుడు 31 జనవరి 2023 నాటికి పట్టభద్రుడై ఉంటే ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు. అందుకు సంబంధించిన ఫారం 18 ద్వారా వ్యక్తి వివరాలు భర్తీ చేసి ఇవ్వాలని, డిగ్రీ సర్టిఫికెట్ పై గెజిటెడ్ సంతకం పెట్టి తహశీల్దార్ కార్యాలయం లోదాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఓటరుగా నమోదు చేసుకునేందుకు 06 నవంబర్ 2026 లోపు కార్యాలయంలో ఫారం అందజేయాలని అన్నారు.ఓటర్ గా నమోదు చేసుకునేందుకు ఫారం 18 తహశీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని, ఎలాంటి సందేహాలు ఉన్న తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని అన్నారు. గతంలో ఓటరుగా ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా ఇప్పుడు తప్పక ఓటర్ గా నమోదు చేసుకోవాలని, పాత ఓటర్ జాబితాలో పేరు ఉన్న దానిని పరిగణలోకి తీసుకోవడం జరగదని చెప్పారు.కాబట్టి తప్పక మళ్లీ ఓటర్ గా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఓటర్ గా నమోదు చేసుకునేందుకు ఫారం 18 కు ఆధార్, ఓటర్ ఐడి కార్డు,డిగ్రీ సర్టిఫికెట్ గెజిటెట్ సంతకంతో ఉండాలని తెలియజేశారు.ఒక వేళ కొందరు డిప్లమా చేస్తే డిగ్రీకి సమానంగా ఉండే ఈక్వాలిటీ సర్టిఫికెట్ వారి వారి యూనివర్సిటీ నుంచి పొంది, వాటిని ఫారం 18కు అటాచ్ చేసి ఇవ్వాలన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు చేసుకోవాలని పట్లోళ్ల అమరేందర్ రెడ్డి కోరారు.

Hot this week

జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: ఉద్యోగులతో సమానంగా షరతులు లేని క్యాష్ లెస్...

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాల ప్రదర్శన సందర్శించిన లక్ష్మీ భార్గవి దువ్వాడ

నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి : గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి – సందీప్ బల్లెం, స్కిలోక్రసీ కో ఫౌండర్

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి : మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ,

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి ;  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

అత్య పాత్య జాతీయస్థాయిలో రాణిస్తున్న దమ్మపేట విద్యార్థులు 

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందినటువంటి...

Topics

భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్...

యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్....

బేగంపేటలో బాలమల్లు కుటుంబానికి ఆర్థిక సాయం

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలం, బేగంపేట: గ్రామానికి చెందిన...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.