నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఉద్యోగులతో సమానంగా షరతులు లేని క్యాష్ లెస్ హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటుగా జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ
టీయూడబ్ల్యూ(టీజేఎఫ్)143 ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ద్వారా విన్నప కార్యక్రమాన్ని శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు మంజూరు చేసి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని జర్నలిస్టుల సంక్షేమ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఒకవైపు చెబుతూనే సమస్యలు తీర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే(టీజేఎఫ్) నాయకులు వట్టి కొండ రవి, సహాయ కార్యదర్శి కాగితపు వెంకటేశ్వరరావు, కృష్ణ గోవింద్, మోటమర్రి రామకృష్ణ, సీమకుర్తి రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, నాయకులు చావా పాపారావు, కృష్ణారావు రమేష్, రమణ, తారక్, అశోక్, ప్రవీణ్, ఈశ్వర్ షబ్బీర్, శ్రీనివాస్, రాందాస్, జక్కంపూడి నరేష్ సత్య, శనగ లక్ష్మణ్, రహీం, స్వామి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

