గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు విస్తృతంగా కృషి చేయాలి – రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

తరతరాలుగా పోడు కొట్టుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారికి పోడు భూముల సమస్యల పరిష్కారంపై త్వరలోనే తీపి కబురు చెబుతానని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆదివారం లక్ష్మీదేవి పల్లి మండలం రేగళ్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశంలో ప్రసంగించారు. అటవీ భూములకు సంబంధించి కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని కేంద్రంతో సంప్రదించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యం

గత తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో పేదలను పట్టించుకోలేదని గళ మెత్తిన నిరుద్యోగులను ఉరికించి కొట్టారని 33 నెలల మా ప్రజా ప్రభుత్వ పాలనలో రైతు రుణమాఫీ రైతు భరోసా క్వింటాకు రూ.500 బోనస్ మహిళలకు ఉచిత బస్సు ప్రాయాణం పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉద్యోగులకు నోటిఫికేషన్లతో ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్నామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్లిస్తే కమిషన్లు రావని లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి ఇష్టం వచ్చినట్లు దోచుకోగా వారు అధికారంలో ఉన్నప్పుడే అది కూలే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అన్ని గ్రామాలకు నిధులిస్తానని ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అన్ని గ్రామాలకు నిధులను కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను మూడు అవసరమైతే నాలుగో విడతలో కూడా మంజూరు చేస్తామని రాజకీయాలకు అతీతంగా పేదలకు కేటాయిస్తామని వెల్లడించారు. హైదరాబాదులోని పేదలు వారు పనిచేసే ప్రాంతాల్లోనే ఖరీదైన భూముల్లో అపార్ట్ మెంట్లు కట్టించి ఇస్తున్నామని ఒక్కొక్కరికీ రూ.కోటి విలువ చేసే ఇల్లు దక్కుతోందని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బృందాలుగా గ్రామ మండల స్థాయిలో విస్తృతంగా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, సీనియర్ నాయకులు నాగా సీతారాములు, ఆళ్ల మురళి, గోపాలరావు, మండల అధ్యక్షులు ప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Hot this week

సురేష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

  నవపక్షం, యాదగిరిగుట్ట అక్టోబర్ 04 : మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి

నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై...

అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి ఘాట్ రోడ్డు...

ఎలాంటి అనుమతులు లేని ప్రొడక్ట్స్, విక్రయిస్తున్న, సోను లేడీస్ ఎంపోరియం పై దాడి

నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :  ఎలాంటి అనుమతులు లేకుండా సోను లేడీస్ ఎంపోరియం...

పనులు నాణ్యత తో పాటు వేగంగా పూర్తి చేయాలి – వికారాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్:    వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి వార్డుల్లో జరుగుతున్న సిసి...

Topics

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం – కౌన్సిలర్ చిట్యాల రచిత సాయి చరణ్ రెడ్డి

  నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి.   వికారాబాద్ మున్సిపాలిటీ 24వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ చిట్యాల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.