అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ 

నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి ఘాట్ రోడ్డు మృత్యుకూపంగా మారుతోందని, ఇక్కడ నిత్యం జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి తగిన నివారణ చర్యలు చేపట్టాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) డిమాండ్ చేసింది. శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి వికారాబాద్‌లోని ఈశా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం బీఎస్పీ పార్టీ బృందం పరామర్శించింది.

ఈ సందర్భంగా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జీ సయ్యద్ అమీర్, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కట్టెల మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వ్యక్తిగతంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రభుత్వమే బాధితులకు పూర్తి వైద్య ఖర్చులు భరించి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఘాట్ రోడ్డులో భారీ వాహనాలు బోల్తా పడటంతో పెద్ద సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు.

వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఎలాంటి కనీస చర్యలు తీసుకోవడం లేదని, ప్రమాదాల నివారణకు ఎన్నో సాంకేతిక మార్గాలు అందుబాటులో ఉన్నా, ఎక్కడా వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఈ ఘాట్ రోడ్డులో కనీస హెచ్చరిక సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.

అనంతగిరి ఘాట్ రోడ్డులో నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రతి మరణానికి ముమ్మాటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఎస్పీ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటికైనా యంత్రాంగం మొద్దునిద్ర వీడి తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ఘాట్ రోడ్డు వెంబడి ప్రమాద హెచ్చరిక బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని,

వాహనాల వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్లతో పాటు ఆధునిక సాంకేతిక భద్రతా చర్యలను అమలు చేయాలన్నారు. ఘాట్ రోడ్డులో భారీ వాహనాల రాకపోకలపై ప్రత్యేక నిఘా ఉంచాలని,

ప్రమాదాల నివారణకు శాశ్వత ప్రాతిపదికన ప్రణాళిక రూపొందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ

వికారాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్

ఫిరంగి జనార్ధన్, వికారాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు మహేందర్, యు. రమేష్ బాబు కొడంగల్ నియోజకవర్గం ఇన్చార్జ్,

శ్రీనివాస్ కొడంగల్ నియోజకవర్గం అధ్యక్షులు, ఎం. వెంకటేశం ఉపాధ్యక్షులు,

బి. కేశవులు ప్రధాన కార్యదర్శి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

సురేష్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

  నవపక్షం, యాదగిరిగుట్ట అక్టోబర్ 04 : మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు...

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు విస్తృతంగా కృషి చేయాలి – రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నవపక్షం, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: తరతరాలుగా పోడు కొట్టుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల పునఃప్రారంభంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి

నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత అంశంపై...

ఎలాంటి అనుమతులు లేని ప్రొడక్ట్స్, విక్రయిస్తున్న, సోను లేడీస్ ఎంపోరియం పై దాడి

నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ :  ఎలాంటి అనుమతులు లేకుండా సోను లేడీస్ ఎంపోరియం...

పనులు నాణ్యత తో పాటు వేగంగా పూర్తి చేయాలి – వికారాబాద్ మునిసిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్:    వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరి వార్డుల్లో జరుగుతున్న సిసి...

Topics

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

కడ్తాల్ లోని మైసి గండి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి రంగరాజ్ 

  నవపక్షం ప్రతినిధి, వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు కాకి...

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరం – కౌన్సిలర్ చిట్యాల రచిత సాయి చరణ్ రెడ్డి

  నవపక్షం, వికారాబాద్ ప్రతినిధి.   వికారాబాద్ మున్సిపాలిటీ 24వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ చిట్యాల...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.