అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి కి ఘన సత్కారం

నవపక్షం, కోట మండల ప్రతినిధి :

కోట మండలం కొక్కుపాడు సెక్టార్ పరిధిలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామం ఎస్టీ కాలనీలో సోమవారం 8వ జాతీయ పోషణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ మునికుమారి ఆదేశాల మేరకు సూపర్వైజర్ పద్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, మహిళలకు పోషకాహారం, ఆరోగ్యం,పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు,చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే పోషణ మహోత్సవం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు చిన్న వయస్సు నుంచే సరైన పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమన్నారు.గర్భిణులు, బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.గర్భధారణ సమయంలో తల్లి తీసుకునే ఆహారం తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపారు.అందువల్ల పోషక విలువలు కలిగిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని కోరారు.
ఆకుకూరలు,కూరగాయలు, పప్పుధాన్యాలు,చిరుధాన్యాలు,పండ్లు, గుడ్లు తదితర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని పద్మ సూచించారు.పిల్లలకు కేవలం కడుపు నిండే ఆహారం కాకుండా శరీర ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అందేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు.
చిన్నారుల ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి బరువు, ఆరోగ్య పరిస్థితిపై అంగన్‌వాడీ సిబ్బంది సూచనలను పాటించాలని తెలిపారు. పిల్లల్లో పోషకాహార లోపం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సలహాలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం,ఆరోగ్య సేవలను గర్భిణులు,బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోషకాహారంతో పాటు పరిశుభ్రత కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పద్మ పేర్కొన్నారు.భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శుద్ధమైన తాగునీటిని వినియోగించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు.కిశోర బాలికలు కూడా పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఎదుగుతున్న వయస్సులో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది సూచనలను పాటించాలని తెలిపారు.
ఈ సందర్భంగా నెల్లూరుపల్లి అంగన్‌వాడీ టీచర్ విజయలక్ష్మిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించారు. ఆమె అందిస్తున్న సేవలను అభినందిస్తూ కార్యక్రమంలో సన్మానం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డ ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని సూపర్వైజర్ పద్మ పేర్కొన్నారు.ప్రతి కుటుంబంలో పోషకాహారంపై అవగాహన పెంచడంతో పాటు పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది విజయలక్ష్మి, మీరమ్మ, హేమలత,స్వాతి,జయమ్మ,రమణమ్మ,తల్లులు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

చిన్న దడిగి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమావేశం

​నవపక్షం, జుక్కల్ ప్రతినిధి: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్న దడిగి గ్రామంలో...

ఆవల్‌గావ్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల అవగాహన మరియు పేర్ల నమోదు

నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : ఎల్-నినో ప్రభావం వల్ల రాబోయేకాలంలో తలెత్తే వర్షాభావ...

నాణ్యత కలిగిన సన్న బియ్యం పంపిణీ ఉద్దేశంతోనే స్మార్ట్ కార్డుల పంపిణీ

  నవపక్షం, శాలిగౌరారం : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం...

మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌...

మాక్‌ ఎలక్షన్స్‌తో ఎన్నికల ప్రక్రియపై అవగాహన

నవపక్షం , దేవరకొండ మండల ప్రతినిధి : విద్యార్థులకు ఎన్నికల నిర్వహణ, ఓటింగ్‌...

Topics

వార్డు సభ్యుల మండల కన్వీనర్ గా బొల్లికొండ గణేష్ యాదవ్

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం మండల...

కరువులోనూ కలిసొచ్చే వరి.. NS DHAAN-1

నవపక్షం, వ్యవసాయ ప్రతినిధి : మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతలో మార్పుల...

పత్తిలో అధిక దిగుబడులకు శాస్త్రీయ సాగు విధానాలు

  మర్రిగూడ మండల ప్రతినిధి : పత్తి సాగులో అధిక దిగుబడులు సాధించడంతో పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.