నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :
దేవరకొండలో మంగళవారం రాత్రి సమ్మర్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని చర్చ జరుగుతోంది. పలు ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ముందుగానే ప్రశ్నపత్రాలను విద్యార్థులకు చూపించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై MEOను వివరణ కోరగా, దేవరకొండలో ఎటువంటి లీక్ జరగలేదని తెలిపారు.


