నవపక్షం, నల్లగొండ జిల్లా ప్రతినిధి :
సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 (1) బి కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనిపించినందుకు గాను నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ నుండి ఉత్తర్వులు అందాయి .ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈ అవార్డును స్వీకరించనున్నారు.


