నవపక్షం, రణస్థలం ప్రతినిధి :
పిసిని గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా వారాహి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త, శ్రీ నీలకంఠ కృష్ణవేణి గురు మాతాజీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా వాగ్దేవి సరస్వతి దేవి అవతారంలో శ్రీ దుర్గా మాత ఈరోజు భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే వారాహి అమ్మవారు కూడా శ్రీ లక్ష్మి స్వరూపమైన లక్ష్మీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని కూడా ఈరోజు భక్తులు దర్శించుకున్నారు. పూజలు, కైంకర్యాలతో పాటు భక్తుల భజనలతో అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. నైవేద్యంగా పులిహోర, దద్ధోజనం, క్షీరాన్నం భక్తులు సమర్పించుకున్నారు. సుమారు వెయ్యి మంది భక్తులకు మరియు భవాని మాల దీక్ష పరులకు ఈరోజు మధ్యాహ్నం అన్నదాన ప్రసాదం పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. శ్రీ నీలకంఠ కృష్ణవేణి గురు మాతాజీ మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రతి ఒక్క భక్తుని పై ఉండాలని గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆమె తెలియజేశారు.


