నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :
మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో నాంపల్లి సర్పంచ్ నక్క చంద్రశేఖర్ – సోనీ దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు.
అనంతరం భక్తులకు తీర్థ,ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది.


