నవపక్షం నకిరేకల్ ప్రతినిధి :
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నోముల గ్రామంలోని శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.విజయదశమి పర్వదినం సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు తమ వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలు, కార్లకు పూజలు చేయించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. వాహనాలకు పసుపు, కుంకుమలు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. దసరా పండుగ సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.


