ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలిగా మేడికొండ జయలక్ష్మి చౌదరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి కవిత చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు.
తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి జయలక్ష్మి చౌదరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని ఆమె పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని జయలక్ష్మి చౌదరి తెలిపారు.


