నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి:
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డా. ఎం.డి. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి, ఏకలవ్య జాతీయ వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కుతాడి కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా కుతాడి కుమార్ మాట్లాడుతూ, యువత సామాజిక సేవతో పాటు రాజకీయాల్లోకి రావాలని, ప్రజాసేవకు అంకితమైన యువతకు తమ సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. డా. ఆరిఫుద్దీన్కు తన మద్దతుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంఘం సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ పట్టభద్రులు, ఉద్యోగ అభ్యర్థులు, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని డా. ఆరిఫుద్దీన్ తెలిపారు. ఉమ్మడి మూడు జిల్లాల పట్టభద్రులు తనకు మద్దతు అందించాలని విజ్ఞప్తి చేస్తూ, సహకరిస్తున్న మీడియా ప్రతినిధులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.


